యువతకు స్కిల్ హబ్‌లలో శిక్షణ: కలెక్టర్

యువతకు స్కిల్ హబ్‌లలో శిక్షణ: కలెక్టర్

సత్యసాయి: యువతకు నైపుణ్యాలు పెంచి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీ సత్యసాయి జిల్లాలో 8 స్కిల్ హబ్‌లు, ఒక నైపుణ్య కళాశాల ఏర్పాటు చేశామని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఐటీ, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.