'స్వమిత్వ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి'

VZM: పారదర్శకంగా స్వమిత్వ సర్వే పనులను నిర్వహించాలని డివిజనల్ పంచాయతీ అధికారి శిరీష రాణి అన్నారు. మండలంలోని సీతారామునిపేట గ్రామంలో గురువారం నిర్వహించిన స్వమిత్వ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్వే ప్రజలకు తమ ఆస్తులపై స్పష్టమైన హక్కులను అందిస్తుందని చెప్పారు. సర్వేను మ్యాప్‌లతో పరిశీలించి సర్వే సక్రమంగా క్రమ పద్ధతిలో నిర్వహించాలన్నారు.