'అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి'
KMR: నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లిలో శుక్రవారం ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఏప్రిల్ 14న డా.బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్, సెక్రెటరీల ఆధ్వర్యంలో విగ్రహాలను అలంకరించి, దళిత నాయకుల సమన్వయంతో వేడుకలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు ఉన్నారు.