VIDEO: 'తడిసిన పత్తిని మద్దతు ధరతో కొనాలి'
WGL: జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ భారీ వర్షం కారణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన పత్తి పంట తడిసి ముద్దయింది. మార్కెట్‌కు చేరిన పత్తి తడవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ.. తడిసిన పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.