విజయవాడలో 78 కేజీల గంజాయి పట్టివేత

కృష్ణా: విజయవాడ గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో 78 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద వెహికల్ చెకింగ్ నేపథ్యంలో అశోక్ లేలాండ్ వాహనాన్ని ఆపి చెక్ చేయగా 78 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. డ్రైవర్ మన్నే శేషగిరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.