పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలి: జగన్

AP: పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని మాజీ సీఎం జగన్ సూచించారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జీలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. మీరంతా సమర్థులని భావించి బాధ్యతలను పరిశీలకులకు అప్పగించినట్లు వెల్లడించారు.