VIDEO: కారు-లారీ ఢీ.. నలుగురికి గాయాలు

VIDEO: కారు-లారీ ఢీ.. నలుగురికి గాయాలు

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటి పరిధిలోని తల్లాడ రోడ్డులో వే బ్రిడ్జి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండపేట, రామచంద్రపురం గ్రామాల నుంచి ఖమ్మం వైపు వెళుతున్న కారు, లారీని ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.