రైతులకి ఎస్పీ కీలక సూచన

రైతులకి ఎస్పీ కీలక సూచన

NLG: జిల్లాలో రహదారులపై రైతులు ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళ రాళ్లు పెట్టి, నల్ల కవర్లు కప్పడం వల్ల ధాన్యం కుప్పలు కనబడక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రహదారులపై కాకుండా ఇతర ప్రదేశాల్లో ధాన్యాన్ని ఆరబెట్టి ప్రమాదాల నివారణకు సహకరించాలని రైతులను కోరారు.