మళ్లీ బీఆర్ఎస్సే వస్తుంది.. అధైర్యపడొద్దు: కేటీఆర్
TG: బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలం లక్కాపూర్ గ్రామంలోని సోయాబిన్, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని.. అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా కల్పించారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.