శోభాయాత్రలో కేరళ సింగారి మేళం అదరహో..!

శోభాయాత్రలో కేరళ సింగారి మేళం అదరహో..!

కడప: నగరంలో శ్రీరాముని మహా శోభాయాత్ర వైభోపేతంగా కొనసాగుతోంది. ఈ శోభాయాత్రలో కేరళ నుంచి వచ్చిన బృందం చేస్తున్న సింగారి మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేరళ రాష్ట్ర సంప్రదాయ వాయిద్యమైన సింగారి మేళంతో వారు చేస్తున్న విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. కేరళ మంగళ వాయిద్యాలను వీక్షించేందుకు భక్తులు అమితాసక్తి చూపిస్తున్నారు.