జూదం ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్

జూదం ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్

AKP: చోడవరం మండలం అడ్డూరు గ్రామ సమీపంలో మజ్జి గౌరమ్మ ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం జూదం ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.63,080 నగదు, 104 కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై జోగారావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.