ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా: రాహుల్

కులగణన కోసం ఎన్నో ఏళ్లుగా తాను పోరాటం చేస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వెల్లడించారు. ఎందుకంటే దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన వారిని అందుకు దూరం చేస్తే భారత్ అభివృద్ధి చెందదు కదా అని అన్నారు. గతంలో కులగణనను BJP విభజనవాదంగా పిలిచిందని.. చివరకు ప్రజల అభిప్రాయాన్నే వినాల్సి వచ్చిందని తెలిపారు. కులగణన అనేది దేశ అభివృద్ధి కొత్త నమూనాకు తొలి అడుగని అభిప్రాయపడ్డారు.