'వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలి'

'వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలి'

VZM: ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని సోంపురం పెట్రోల్ బంకు వద్ద ఎస్సై సిహెచ్.నవీన్ పడాల్ సిబ్బందితో సోమవారం రాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని నిలిపి శీతాకాలం నేపథ్యంలో పొగమంచు అధికంగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలని సూచించారు. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడపకూడదన్నారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 వేలు జరిమానా వసూలు చేశామన్నారు.