మావోలతో చర్చల ప్రసక్తే లేదు: బండి సంజయ్

TG: మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. 'తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్సే. మావోయిస్టులు.. పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా చంపారు. రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్ చెప్పాలి' అని పేర్కొన్నారు.