బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా పండగ సాయన్న వర్ధంతి
NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం పండగ సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలోని బీసీ భవనంలో ఆయన చిత్రపటానికి బీసీ జేఏసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల కోసం ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో-కన్వీనర్ దాసరాజు జయరాజు, చేగొండి మురళి యాదవ్, కొండ రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.