జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు

జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు

SDPT: సిద్దిపేట సురక్ష నేత్ర పేరుతో జిల్లాలో ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ములుగు మండలం కొత్తూరులో సర్పంచి సరిత గోవర్ధన్ ఆధ్వర్యంలో రూ.4 లక్షలతో ఏర్పాటుచేసిన 20 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా 200 కెమెరాలను ప్రారంభించామన్నారు. అన్నీ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.