VIDEO: మోదకొండమ్మ జాతర మహోత్సవాలకు ముహూర్తం ఖరారు
ASR: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు మే 10, 11, 12 తేదీల్లో ఘనంగా జరగనున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు ఈ మేరకు ప్రకటించారు. ఆలయ ప్రధాన అర్చకులు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ ప్రకటన వెలువడగానే వాతావరణం చల్లబడి, మబ్బులు కమ్ముకోవడాన్ని భక్తులు అమ్మవారి శుభశకునంగా భావిస్తున్నారు.