రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చల్ గల్ గ్రామానికి చెందిన బొల్లే సిద్దార్థ(18) అనే యువకుడు, ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. మామిడికాయల మార్కెట్‌లో ఉపాధి కోసం వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు.