విశ్వశాంతి యాగంలో పాల్గొన్న ఎంపీ
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో విశ్వశాంతి యాగం దిగ్విజయంగా కొనసాగుతోంది. గురువారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీఎస్పీ భార్గవి హోమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు చండీ హోమంలో పాల్గొన్నట్లు అర్చకులు తెలిపారు. అనంతరం కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి, భక్తులకు ఆశీర్వచనం చేశారు.