పెళ్లి అయిన 50 రోజులకే ఆత్మహత్య
TG: హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్, నీరజ్ బన్సాల్ ఐదేళ్ల ప్రేమ తర్వాత ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అయితే, అదనపు కట్నం కోసం నీరజ్ వేధించడంతో మనస్తాపం చెందిన ఇషిక, పెళ్లయిన 50 రోజులకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.