రూ.35 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

రూ.35 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

ELR: మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 75 మంది నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మొత్తం రూ.35.01 లక్షల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత 16 నెలల కాలంలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు 995 మందికి రూ.7.14 కోట్ల సహాయ నిధి చెక్కులు అందించామని ఆయన తెలిపారు.