‘గిట్టుబాటు ధర దక్కడం లేదు’

‘గిట్టుబాటు ధర దక్కడం లేదు’

WG: ధాన్యం తూకాలలో జరుగుతున్న మోసాలను, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం ఇరగవరం (M) కంతేరులో పర్యటించిన ఆయన.. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు సాగాలని కోరారు. తక్షణమే అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.