VIDEO: 'ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అటవీ అధికారులు'
MNCL: బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినట్లు బాధితులు రజిత, నాగమణి, రాజం తెలిపారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటూ కరెంట్ బిల్లు, ఇంటి పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.