అనారోగ్యంతో పూజారి మృతి
KMM: సింగరేణి మండలం, గేట్ కారేపల్లిలో పూజారి వలివేటి సురేందర్ శర్మ(35) ఇవాళ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గ్రామంలోని శివాలయంలో గత పదేళ్లుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూజారి మృతిలో కుటుంబంతో పాటుగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.