బాధిత కుటుంబానికి భీమా పరిహారం అందజేత

బాధిత కుటుంబానికి భీమా పరిహారం అందజేత
SKLM: పలాసలో ఇటీవల వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో తీవ్రంగా గాయపడిన డొక్కర అమ్మలకు ఎమ్మెల్యే గౌతు శిరీష రూ. 5 లక్షల ప్రమాద బీమా మంజూరు చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి బీమా ప్రయోజనాన్ని అందజేశారు. అమ్మలకు టీడీపీ సభ్యత్వం ఉండడం వల్లే ఈ బీమా మంజూరు అయిందని, ఈ అవకాశం ఆమెకు దక్కిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీసీ నాయకులు పాల్గొన్నారు.