మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న : జడ్జ్

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న : జడ్జ్

కృష్ణా: మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వీరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు జడ్జి మండవ కిరణ్మయి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ముఖ్య అర్చక బుద్దు సతీష్‌లతో పలువురు పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి, మొక్కులు చెల్లించుకున్నారు.