పంచాయతీలోని కాలువల్లో పూడిక తీత పనులు

AKP: మాడుగుల మండలం శంకరం పంచాయతీలో గురువారం కాలువల్లో పూడికతీత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సర్పంచ్ సోలం రమేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో అంటు వ్యాధులు, విష జ్వరాలు సోకకుండా ముందు జాగ్రత్తగా డ్రైనేజీలలో పూడికతీత పనులు చేపట్టి బ్లీచింగ్ చెల్లించి క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు.