కూలీల వాహనం బోల్తా.. 18 మందికి గాయాలు

కూలీల వాహనం బోల్తా.. 18 మందికి గాయాలు

PDPL: సుల్తానాబాద్ మండలం చిన్నకల్వలలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ కూలీలు సుల్తానాబాద్‌లో వరి నాట్లు వేసేందుకు బొలెరో వాహనంలో వస్తున్నారు. ఈ క్రమంలో రాజీవ్ రహదారిపై వాహనం బోల్తా పడింది. దీంతో 18 మంది గాయపడగా క్షతగాత్రులను సుల్తానాబాద్‌, పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.