అడుసుమల్లిలో ‘మన ఊరు–మన బడి’పై అవగాహన
BPT: "మన ఊరు-మన బడి-మన భవిష్యత్" కార్యక్రమంలో భాగంగా ZPHS అడుసుమల్లి ఉపాధ్యాయులు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామంలోని బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మంచి విద్య, నాణ్యమైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు.