VIDEO: వైభవంగా క్రీస్తు మహోత్సవ జెండా ప్రతిష్ట
GNTR: ఫిరంగిపురం బాలయేసు కథెడ్రల్ దేవాలయంలో ఆదివారం క్రీస్తు మహోత్సవ జెండా ప్రతిష్ఠ కార్య క్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఫాదర్స్ బంగళా నుండి బాలయేసు కథెడ్రల్ దేవాలయం వరకు పండుగ జెండాతో ఊరేగింపు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో దివ్య పూజాబలి సమర్పించారు. అనంతరం బాల యేసు దేవాలయ విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి జెండాను ప్రతిష్ఠించారు.