కోదాడలో రోడ్లు జలమయం.. ప్రజల ఇబ్బందులు

SRPT: కోదాడ బస్టాండ్ సమీపంలోని ఎమ్మెస్ కళాశాల వెళ్లే దారిలో ఇవ్వాళ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. దీనితో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీటి లోతును అర్థం చేసుకోలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.