VIRAL VIDEO: అదృష్టమంటే ఇతనిదే
యూపీ ఎటావా జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. అయితే, బస్సు వేగంగా రావడాన్ని గమనించిన ఓ సైకిలిస్ట్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. 'చావును దగ్గర నుంచి చూశాను' అని ఆ వ్యక్తి చెబుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.