VIDEO: నిజాంసాగర్ రోడ్డుపై చిరుత సంచారం
KMR: నిజాంసాగర్ మండలం మాగి శివారులో సైలాని దర్గా వద్ద రోడ్డుపై నిన్న రాత్రి చిరుత పులి ప్రత్యక్షమైంది. అటుగా లారీలో వెళ్తున్న ఓ డ్రైవర్ చిరుతను గమనించాడు. వెంటనే తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. రాత్రి వేళ చిరుత రోడ్డుపై స్వేచ్చగా తిరుగుతున్న ఈ వీడియో ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనతో పరిసర గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.