నేడు కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు

నేడు కన్యకాపరమేశ్వరి ఉత్సవాలు

KMR: నేడు(శుక్రవారం) భిక్కనూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే మహిళలు సామూహిక కుంకుమార్చన, మంగళ నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.