కిలో రూ.1కి ధర పతనం
ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇప్పటికే పాత ఉల్లి నిల్వలు ఉండగా ఇప్పుడు కొత్త పంట మార్కెట్‌లో రావడంతో ధరలు పడిపోయాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధర కేజీ రూ.1కి పతనమైంది. దాదాపు ఆరు నెలలుగా తమ ఉత్పత్తులను నిల్వ చేసినప్పటికీ సరైన ధర లభించలేదని రైతులు వాపోతున్నారు.