ఖమ్మంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు బదిలీలు

KMM: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం వన్ టౌన్, త్రీ టౌన్, టాస్క్ ఫోర్స్ కార్యాలయాలలో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సంబంధిత అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం టౌన్‌కు రమేష్, త్రీ టౌన్‌కు రామకృష్ణ, టాస్క్ ఫోర్స్‌కు బాలాజీలు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా నియామితులయ్యారు.