మొబైల్‌ టవర్‌ ఏర్పాటు.. గ్రామస్తుల సంబరాలు

మొబైల్‌ టవర్‌ ఏర్పాటు.. గ్రామస్తుల సంబరాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మారుమూలన ఉన్న కొండపల్లి గ్రామంలో తొలిసారిగా మొబైల్ టవర్ ఏర్పాటైంది. దీంతో గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు. పెద్దలు, మహిళలు, పిల్లలందరూ సంప్రదాయ నృత్యాలు చేశారు. ప్రత్యేక పూజలు చేసి టవర్‌ను ప్రారంభించారు. టవర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు తమ ఫోన్లలో సిగ్నల్స్ కనిపించడంతో ఆనందం వ్యక్తం చేశారు.