ఈ నెల 19న నల్గొండలో ప్రత్యేక ప్రజావాణి

NLG: ఈ నెల 19న నల్గొండ కలెక్టరేట్లో వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని వయోవృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.