ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎస్సీ సంఘ సభ్యులు

ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎస్సీ సంఘ సభ్యులు

జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన ఎస్సీ సంఘం సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నిర్వహించనున్న ఎస్సీ సంఘ భవన ప్రారంభోత్సవం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు భూమిపూజ కార్యక్రమాలకు హాజరుకావాలని ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ కార్యక్రమాలకు హాజరవుతానని తెలిపారు.