ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

W.G: వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో వేంచేసియున్న శ్రీరామభక్త ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. నందమూరి గరువు గ్రామంలోనే ప్రసిద్ధ హనుమంతుని దేవాలయమని, ఆంజనేయ స్వామి దర్శనం ఎంతో పుణ్య ఫలమన్నారు.