ప్రభుత్వ ఐటీఐలో సమస్యలు పరిష్కారానికై కలెక్టర్‌కు వినతి
SRD: సంగారెడ్డి లోని ప్రభుత్వ ఐటీఐలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్యం ఐటీఐలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.