VIDEO: ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం

MDK: చిన్న శంకరం పేట మండల కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా రూ. ఆరు వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తూ, మండల పార్టీ అధ్యక్షులు పోగుల రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.