షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. కాలి బూడిదైన ఫర్నిచర్

షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. కాలి బూడిదైన ఫర్నిచర్

NLG: నార్కట్‌పల్లి మండలం యెల్లారెడ్డిగూడెం గ్రామంలో ప్రథమ చికిత్సాలయం (క్లినిక్ )లో షార్ట్ సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. ఒక్కసారితో మంటలు చెలరేగడంతో క్లినిక్‌లో ఉన్న ఫ్రిడ్జ్, మెడిసిన్, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో పెద్దమొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. మంటలు బయటికి వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.