చిరంజీవికి రామ్ చరణ్ ఎమోషనల్ రిప్లయ్

చిరంజీవికి రామ్ చరణ్ ఎమోషనల్ రిప్లయ్

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తనపై కురిపించిన ప్రశంసలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భావోద్వేగంగా స్పందించాడు. 'థ్యాంక్యూ నాన్నా. మీ ప్రోత్సాహమే నాకు సర్వస్వం. ఇది నన్ను నేల మీదే ఉండేలా, మరింత కష్టపడి పనిచేసేలా, ఎప్పటికప్పుడు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేలా గుర్తుచేస్తుంది' అని ఎమోషనల్ రిప్లయ్ ఇచ్చాడు. అయితే, 'పెద్ది' మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.