పదవీకాలం పొడిగింపు

NLG: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కృష్ణవేణి హాస్టల్ డిప్యూటీ డైరెక్టర్‌గా డా. కళ్యాణి పదవీకాలం పొడిగించారు. వార్డెన్‌గా తెలుగు విభాగం అధ్యాపకురాలు అనిత కుమారి నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలవాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇరువురు ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. ఈ సందర్భంగా ఇరువురికి సహాధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.