అనంతలో ఈనెల 26న బీసీ గళం కార్యక్రమం

అనంతలో ఈనెల 26న బీసీ గళం కార్యక్రమం

ATP: ఉరవకొండ వైసీపీ కార్యాలయంలో 'బీసీ గళం' కార్యక్రమ పోస్టర్లను బుధవారం బీసీ సెల్ రాష్ట్ర నాయకులు గోకుల పుల్లయ్య, నవీన్ కుమార్ ఆవిష్కరించారు. ఈనెల 26న అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో జరిగే సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల బీసీ నాయకులు పాల్గొన్నారు.