‘ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉంది’

‘ఎమ్మెల్యే వల్ల ప్రాణహాని ఉంది’

అన్నమయ్య: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ నాయకుడు మల్లెం హేమంత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన స్థానిక సీఐ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు సమర్పించారు. హర్ష వీణ వ్యవహారంలో ఎమ్మెల్యే తనను లక్ష్యంగా చేసుకున్నారని, తన భద్రతపై భయం కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.