VIDEO: శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన MLA
GNTR: శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. పెదనందిపాడు సహా ఐదు చోట్ల మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధర నిర్ణయించామన్నారు. రైతులు వీఏఏల వద్ద సీఎం యాప్‌లో నమోదై, 14శాతం లోపు తేమ ఉన్న సరుకును తీసుకురావాలని సూచించారు.