బెల్ట్ షాప్‌లపై టాస్క్ ఫోర్స్ దాడులు

బెల్ట్ షాప్‌లపై టాస్క్ ఫోర్స్ దాడులు

WGL: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాప్ ల పై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంఘటన శుక్రవారం గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం నేపథ్యంలో సదరు షాపుపై సోదాలు చేశారు. బేల పూర్ణచందర్ అనే వ్యక్తి షాపు నుండి రూ. 76 వేల విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు.