బోధన్‌లో దొంగల బీభత్సం
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. జనగణన పేరుతో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టేసి 5 తులాల బంగారం దోపిడీ చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.